Header Banner

కడపలో మహానాడు వేదికపై స్పృహ తప్పి పడిపోయిన మాజీ ఎమ్మెల్యే! హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు..

  Thu May 29, 2025 20:48        Politics

తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న మహానాడులో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. పార్టీ సీనియర్ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ వేదికపైనే అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే, కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా జలీల్ ఖాన్ వేదికపై ఉన్నారు. ఈ క్రమంలో ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది గమనించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు. తక్షణమే స్పందించి, జలీల్ ఖాన్‌ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

ఇది కూడా చదవండి: సీబీఎన్‌ అంటే ప్రజలందరికీ ధైర్యం! లోకేశ్ సంచలన వ్యాఖ్యలు!

        

ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జలీల్ ఖాన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుపరిచితమైన వ్యక్తి. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం, 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలీల్ ఖాన్‌ను ఏపీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా కూడా నియమించారు. ఈ పదవి ముస్లిం మైనారిటీ వర్గాల్లో ప్రాముఖ్యత కలిగినదిగా పరిగణిస్తారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations